బెంగాల్‌ లో కాంగ్రెస్‌ మంత్రుల రాజీనామా

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ లోని సంకీర్ణ సర్కారులోని ఆరుగురు కాంగ్రెస్‌ మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేశారు.తమ రాజినామ పత్రాలను వారు సాయంత్రం ముఖ్యమంత్రి మమతబెనర్జికి ఇవ్వనున్నట్టు బెంగాల్‌ పీసీసీ అధ్యక్షుడు ప్రదీప్‌ బట్టాచార్య తెలిపారు.ఆరుగురు కాంగ్రెస్‌ మంత్రులతో కలిసి ఆయన గవర్నర్‌ నారాయణన్‌ను కలుసుకోని తాము ప్రభుత్వానికి మద్దతు ఉప సంహరిస్తున్నట్టు తెలిపారు.అయితే 294 మంది సభ్యులున్న కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదు.