బెయిల్ పిటిషన్
హైదరాబాద్: ఓఎంసీ కేసులో నిందితురాలు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి మరోమారు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలుచేశారు. ఈ కేసులో తాను గడచిన ఏడు నెలలుగా కస్టడీలేనే ఉన్నానని, దర్యాప్తులో భాగంగా సీబీఐతో పాటు ఎస్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఇప్పటికే తనను ప్రశ్నించినట్లు ఆమె తెలిపారు. బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ ఆమె హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది.