బొగ్గు కుంభకోణంలో ప్రధాని, గడ్కరీ నివాసాల వద్ద ఆందోళన

న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపుల్లో కాంగ్రెస్‌, భాజపాలు దొందూ దొందే అని ఇండియా అగైనెస్ట్‌ నాయకుడు కేజ్రీవాల్‌ ఆరోపించారు. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, భాజపా జాతీయాధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ నివాసాల వద్ద ఆదివారం ఆందోళన నిర్వహిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఆగస్టు 26 ఆదివారం ఉదయం 10 గంటలకు జంతర్‌మంతర్‌ వద్ద కలుద్దాం. ప్రధాని, గడ్కరీ నివాసాల వద్ద ఆందోళన చేద్దాం అని కేజ్రీవాల్‌ గురువారం ట్వీట్‌ చేశారు.