బొగ్గు కుంభకోణం కేసులో ఐదు కంపెనీలపై కేసులు
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో అక్రమంగా బొగ్గు కేటాయింపులు పొందిన ఐదు కంపెనీలపై తాజాగా సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. వీటిలో విన్నీ ఐరన్ అండ్ స్టీల్స్,నవభారత్ స్టీల్స్ జేఎల్‌డీ యవత్మాల్, జేఏఎస్ పవర్, ఏఎమ్‌ఆర్ ఐరన్ అండ్ స్టీలు కంపెనీలు ఉన్నాయి. మరోవైపు ఛత్తీస్‌ఢ్, జార్ఖండ్‌లోని పలు సంస్థలపై మంగళవారం ఉదయం ఏకకాలంలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్,ఢీల్లి, నాగపూర్, కోల్‌కతా, ధన్‌బాగ్, పాట్నా, ముంబయి నగరాల్లో కూడా సీబీఐ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో దేశవ్యాప్తంగా 30 చోట్ల పలు సంస్థలతోపాటు ప్రముఖుల ఇళ్లలో ఈ సోదాలు జరుగుతున్నాయి. 2006-09 మధ్య కాలంలో జరిగిన బొగ్గు కేటాయింపులపై అధికారులను సీబీఐ ప్రశ్నిస్తోంది.