బొగ్గు గని మూలంగా భూమి కుంగిపోతోంది: కాశీపేట గ్రామస్థులు
మందమర్రి పట్టణం, ఆదిలాబాద్: బొగ్గు గని మూలంగా భూమి కుంగిపోతోందని ఆరోపిస్తూ ఆదిలాబాద్ జిల్లా ముత్యంపల్లి, కాశీపేట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కాశీపేట భూగర్భగని కారణంగా తమ భూములు కుంగిపోతున్నాయని మొదటి షిపుకు వెళ్లే సింగరేణి కార్మికులను అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.