బొమ్మకూరులో ముఖ్యమంత్రికి తెలంగాణ సెగ

వరంగల్‌ :సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డికి బొమ్మకూరులో తెలంగాణ సెగ తగిలింది. వరంగల్‌ జిల్లా నర్మెట్ట మండలం దేవాదుల ప్రాజెక్టులో భాగం ఇవాళ ఆయన బొమ్మకూరు రిజర్వాయర్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తుండగా తెలంగాణ వాదులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆయన ప్రసంగానికి అడ్డతగిలారు. సభా ప్రాంగాణాన్ని జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు తెలంగాణ వాదులపై లారీలతో విరుచుకుపడ్డారు. దొరికిన వారిని  దొరికినట్టు చితకబాదారు. పలువురు  నేతలతో పాటు తెలంగాణ వాదులను అరెస్టు చేసి స్టేష్టన్‌కు తరలించారు.