బొల్లారంలో దోపిడీ దొంగల బీభత్సం

హైదరాబాద్‌:అల్వాల్‌ బొల్లారంలోని ఓ ఇంట్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఇంటి యజమానిని కట్టెసి చోరీకి పాల్పడ్డారు.ఈ ఘటనలో 20 తులాల బంగారం,భారీగా నగదు అపహరణకు గురైనట్లు సమాచారం.పోలీసు కేసు నమోదు చేసి డాగ్‌స్క్వాడ్‌ టీంతో రంగంలోకి దిగారు.