బోగస్ ఉపాధ్యాయులను తొలగించాలి
కడప, జూలై 28 : నకిలీ గిరిజన ధృవపత్రాలతో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిని వెంటనే తొలగించాలని ఎరుకల చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు శనివారం నాడు డిమాండ్ చేశారు. విద్యాశాఖలోనే కాకుండా పలు ప్రభుత్వ శాఖలో బోగస్ ధృవీకరణ పత్రాలతో కొందరు ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలుస్తోందని చెప్పారు. ఈ గిరిజన కోటా కింద ఉద్యోగాలు పొందిన వారందరి సర్టిఫికెట్లను ఒకమారు పరిశీలించాలని కోరారు. గిరిజనులకు వ్యవసాయ భూముల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ఒక అధ్యేయన,,,, కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. గిరిజనుల సమస్యలపై వచ్చే నెల 6వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.