బోథ్ లో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

 బోథ్ ఎప్రిల్ 02 (జనంసాక్షి) బోథ్ మండల కేంద్రంలోని పెద్దార్లగుట్ట ఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల ఆరవ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నట్లు వేద పండితులు నమలికొండ సంతోష్ కుమార్ శర్మ పేర్కొన్నారు. ఈ ఏర్పాట్లలో భాగంగా శనివారం సన్నిధానంలోని హనుమాన్ మాలధారణ స్వాములతో సమావేశమయ్యారు. హనుమాన్ చాలీసా పారాయణానికి ఏర్పాట్లు తదితర విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా పూండ్రు నర్సారెడ్డి పుష్పలత దంపతులు హనుమాన్ హనుమాన్ జయంతి సందర్భంగా తమ స్వంత ఖర్చుతో అన్నదానం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని వారి కుమారుడైన రాకేష్ రెడ్డి సమావేశంలో తెలిపారు. కార్యక్రమం లో భాగంగా బోథ్ సర్పంచ్ సురేందర్ యాదవ్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో మంచి ఉత్సాహాన్ని నింపుతాయని అన్నారు. చెడు అలవాట్లను దూరం చేయడంతో పాటు సామాజిక స్పృహ కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.