బోరుబావిలో పడిన అజిత్ మృతి
కరీంనగర్: ప్రమాదవశాత్తు ఐదేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. కరీంనగర్ జిల్లా మల్హార్ మండలంలోని పల్లెంకుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారమందుకున్న అధికారులు 108 వైద్య బృందం ఘటనాస్థలానికి బయలుదేరారు. బాలుడ్ని రక్షించేందుకు గ్రామస్థులు బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వుతుండాగా 8 అడుగులోతులో అజిత్ మృత దేహం లభ్యం. అజిత్‌ని రక్షించేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.