బ్రహ్మానందరెడ్డిని విచారించేందుకు కేంద్రం అనుమతి

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో మరో ఉన్నతాధికారిని విచారించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఐఆర్‌ఏఎన్‌ అధికారి బ్రహ్మానందరెడ్డిని ప్రాసిక్యూషన్‌ చేసేందుకు సీబీఐకి కేంద్రం నుంచి అనుమతి లభించింది. వాన్‌పిక్‌ వ్యవహారంలో ఈయన నాలుగో నిందితుడిగా ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన విచ్చలవిడిగా కేటాయింపులు చేశారని అభియోగంపై ఆయన్ను విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా సీబీఐ కేంద్రాన్ని కోరింది. దీంతో బ్రహ్మా నందరెడ్డిని విచారించేందుకు కేంద్ర మానవవనరుల వనరుల శాఖ నుంచి అనుమతులు జారీ అయ్యాయి.