భద్రతపై అధికారులతో స్పీకర్‌ సమీక్ష

హైదరాబాద్‌: అసెంబ్లీ వర్షాకాల  సమావేశాల నేపథ్యంలో భద్రతపై స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సమీక్ష చేపట్టారు. ఇంఛార్జి డీజీపీ దినేష్‌రెడ్డి, నగర పోలీసు ఉన్నతాధికారులతో స్పీకర్‌ భేటీ అయ్యారు. అసెంబ్లీ పరిసరాల్లో చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.