భర్త వేధింపుల కారణంగా ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

తాళ్లపూడి: పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో ఒక తల్లి, ఇద్దరు పిల్లలతో సహా కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపుల కారణంగానే ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బంగారమ్మ అనే మహిళ తన ఇద్దరు కుమార్తెలు రేవతి(5), దేవి(2)లతో ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు అక్కడికక్కడే మరణించగా ఒక పాప ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.