భాజపాను గద్దెదించుతాం
` లౌకిక సర్కారును ఏర్పాటు చేస్తాం
` మోడీని ఢీకొట్టేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది
` మేము చేస్తున్నది థర్డ్ ఫ్రంట్ కాదని..ఇదే అసలు సిసలైన ఫస్ట్ ఫ్రంట్
` సోనియాను కలిసిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్
` దేశ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్న భేటి
న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో బిహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భేటీ ముగిసింది. జాతీయ స్థాయిలో మహా కూటమిని ఏర్పాటు చేయాలనే అంశంపై వారు సోనియాతో చర్చింంచినట్లు తెలుస్తోంది. దాదాపు ఆరేళ్ల తర్వాత..సోనియాగాంధీతో నితీష్ కుమార్ భేటీ కావడం దేశ రాజకీయాల్లో ఆసక్తిని రేపింది. మోడీని ఢీకొట్టేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు నితీష్ కుమార్. తాము చేస్తున్నది థర్డ్ ఫ్రంట్ కాదని..ఇదే అసలు సిసలైన ఫస్ట్ ఫ్రంట్ నితీష్ కుమార్ అన్నారు కాగా దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి లేదని ఆర్జేడీ నేత, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు.అందులో నుంచి జేడీయూ, శిరోమణి అకాలీదళ్, శివసేన పార్టీలు బయటకు వచ్చాక ఇంకా ఎన్డీఏ ఎక్కడిదని ప్రశ్నించారు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ వ్యవస్థాపకుడు, మాజీ ఉపప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే ఆ పార్టీలు ఎన్డీయే కూటమిని వీడాయన్నారు.భాజపా తప్పుడు వాగ్దానాలు, అసత్య ప్రచారాలు చేస్తోందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. అందుకే ఆ పార్టీ పేరు భారతీయ జనతా పార్టీ కాదని.. పెద్ద అబద్దాల పార్టీ (బడ్కా రaుఠా పార్టీ) అని అన్నారు. ఇటీవల బిహార్ పర్యటనకు వచ్చిన అమిత్ షా.. పుర్నియాలో విమానాశ్రయం గురించి మాట్లాడారని.. వాస్తవానికి అక్కడ విమానాశ్రయమే లేదన్నారు. వేదికపైనున్న జేడీయూ నేత నీతీశ్ కుమార్, శిరోమణి అకాలీదళ్ సుఖ్బీర్ సింగ్‌బాదల్, శివసేన ఎంపీ అరవింద్ సావంత్ పేర్లను ప్రస్తావించిన తేజస్వి యాదవ్.. వీరంతా గతంలో ఎన్డీయే కూటమిలో ఉన్నావారేనన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకే ఆ కూటమి నుంచి వీరంతా బయటకు వచ్చారన్నారు. ఇటువంటి సమయంలో ఇంకా ఎన్డీయే ఎక్కడుందని ప్రశ్నించారు.కేంద్రంలో భాజపా ప్రభుత్వానికి ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తోన్న పలు పార్టీలు నేడు ఒకే వేదికపైకి వచ్చాయి. హరియాణాలోని ఫతేహాబాద్లో ఐఎన్ఎల్డీ నిర్వహించిన సభకు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, బిహార్ సీఎం నీతీశ్‌కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, శివసేన, సీపీఎం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నీతీశ్ కుమార్.. దేశంలో హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు లేవని.. కేవలం గందరగోళం సృష్టించడానికే భాజపా ఇటువంటి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడిరచాలంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులతో సహా విపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.