భారతదేశం సుభిక్షంగా ఉండాలని సైకిల్ యాత్ర –

 హుజూర్ నగర్ కి చేరిన సైకిల్ యాత్రికుడు – ఘనంగా స్వాగతం పలికిన సాయిసమాజ సేవ మండలి హుజూర్ నగర్ మార్చి 21 (జనంసాక్షి): భారతదేశం శాంతియుతంగా, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా సిందూరు పట్టణానికి చెందిన విజయ గోపాల్ కృష్ణ సైకిల్ యాత్ర చేస్తూన్నారు. మార్చ్ 11-2022 లో ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర ఇప్పటి వరకూ 11 రాష్ట్రాలలో తిరిగి మంగళవారం హుజూర్ నగర్ పట్టణానికి చేరుకుంది. విషయం తెలుసుకున్న షిర్డీ సాయిబాబా దేవాలయం అధ్యక్షులు త్రిపురమల్ల అంజయ్య, ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరరావు లు సైకిల్ యాత్రికుడు విజయ గోపాల కృష్ణ ను స్థానిక సాయిబాబా దేవాలయం లో బాబా దర్శనం చేయించి శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఇప్పటి వరకు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో యాత్ర చేశానని వెళ్లిన ప్రతిచోట ప్రజలు మంచిగా ఆదరిస్తూన్నారని విజయ గోపాల కృష్ణ తెలిపారు. హుజూర్ నగర్ నుండి కోదాడ మీదుగా విజయవాడ, అక్కడ నుండి భద్రాచలం మీదుగా సైకిల్ యాత్ర కొనసాగుతుందన్నారు. సైకిల్ యాత్ర కు స్వాగతం పలికిన వారిలో వట్టికూటి శ్రీనివాస్ గౌడ్, కే వి చలపతి రావు తదితరులున్నారు.