భారతీయ శాస్త్రవేత్తకు ప్రపంచ అత్యధిక నగదు అవార్డు

ఢిల్లీ: అలహాబాదులోని హరీష్‌ చంద్ర రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో భౌతిక శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఆశోక్‌సేన్‌ ఉన్న పళాన ఒక్కసారిగా కోటీశ్వరులయ్యారు. అయన రూ.16.7 కోట్ల నగదు బహుమతి గల యూరీ మిల్నర్‌ ఫండమెంటల్‌ ఫిజిక్స్‌ ప్రైజ్‌ లభించింది. నోబెల్‌ బహుమతికి మూడు రెట్లు ఎక్కువ మొత్తం ఉన్న ఈ అవార్డును యూరీ మిల్నర్‌ అనే రష్యన్‌ ప్రారంభంచాడు. ఫిజిక్స్‌ విద్యార్థి అయిన మిల్నర్‌ 1989లో అర్థాంతరంగా చదవు అపేశాడు. ఆ తర్వాత ఫేస్‌బుక్‌ లాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి కోటీశ్వరుడయ్యాడు. తాను సంపాదించిన డబ్యుతో మిల్నర్‌ ఈ అవార్డు నెలకొల్పాడు. ఫండమెంటల్‌ ఫిజిక్స్‌లో పరిశోధన చేసి సంచనల విజయాలు నమోదుచేసిన శాస్త్రవేత్తలను ఈ అవార్డుతో సత్కరించనున్నారు. ఈ ఏడాది 9మందికి అవార్డు ప్రకటించగా వారిలో అశోక్‌ సేన్‌ ఒకరు. వచ్చే ఏడాది అవార్డు విజేతలను ఎంపిక చేసే బాధ్యత కూడా ఈ ఏటి అవార్డు గ్రహీతలు చేపట్టాల్సివుంటుంది.