భారత్‌ కఠినమైన ఆర్ధిక సంస్కరణలు అమలుచేయాలి:ఒబామా

వాషింగ్టన్‌:రిటైల్‌లాంటి చాలా రంగాల్లో భారత్‌ విదేశీ పెట్టబడులను నిరోదించిన నేపథ్యంలో కఠినమైన ఆర్థిక సంస్కరణలు అమలుచేయకతప్పదని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు.పీటీఐ వార్తాసంస్థకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత ఆర్థిక వృద్దిరేటును ప్రశంసిస్తూనే పెట్టుబడుల వాతావరణం క్షీణిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.జమ్మూకాశ్మీర్‌ సమస్యకు బయటినుంచి పరిష్కారం లేదని ఆయన వ్యాఖ్యానించారు.భారత్‌,పాకిస్థాన్‌ సంబందాలను మెరుగుపర్చుకునే విషయంలో ఆ రెండు దేశాలే ముందుకు రావాలన్న ఆయన దిశగా సాగుతున్న ప్రయత్నాలను స్వాగతించారు.