భారత్‌, రష్యా స్మెర్చ్‌ రాకెట్ల తయారీపై ఒప్పందం

న్యూఢిల్లీ: భారత్‌, రష్యాలు రాకెట్ల తయారీకి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేకు 80 కి.మీ. శ్రేణి ‘స్మెర్చ్‌’ రాకెట్లను మనదేశంలోని ఆర్డ్‌నెన్స్‌ కర్మాగారాల్లో ఉత్పత్తి చేస్తారు. ఆర్డ్‌నన్స్‌ ఫ్యాక్టరీ బోర్డ్‌ (ఓఎఫ్‌బీ), రష్యాకు చెందిన రోసోబోరోన్‌ఎక్స్‌పోర్ట్‌, స్ల్పావ్‌స్పా కంపెనీలతో కలిసి సంయుక్త సంస్థ ఏర్పాటుకు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. అవగాహన ఒప్పందానికి రక్షణమంత్రి ఆంటోనీ ఆమోదం లభించిందని తెలిపింది.