భారత కబడ్డీ జట్టుకు సీఎం నజరానా

హైదరాబాద్‌:  ప్రపంచకప్‌ గెలిచిన భారత కబడీ జట్టును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అభినందించారు. మన రాష్ట్రం తరుపున ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ఆర్‌ నాగలక్ష్మి, మమతా పూజారిలకు ఒక్కొక్కరికి రూ. 25లక్షల చొప్పున కిరణ్‌ నజరానా ప్రకటించారు. మీరు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.