భారత జట్టులో ఎంపికపై యూవరాజ్‌సింగ్‌ సంతోషం

గుర్‌గావ్‌: గుర్‌గావ్‌లో మీడియాతో మట్లాడుతు టీ20 ప్రపంచ కప్‌ క్రికెట్‌కు తాను ఎంపిక కావడం పట్ల యువరాజ్‌సింగ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. తాను ఫిట్‌నెస్‌ నిరూపించుకోవడంలో సఫలమయ్యానని అన్నాడు. భారత జట్టు గెలుపునకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పేర్కొన్నాడు. వన్డేలకు, టెస్ట్‌ మ్యాచ్‌లకు ఎంపిక విషయమై తాను ఆలోచించడంలేదన్నాడు. క్యాన్సర్‌తో తాను పోరాడిన రోజులు మరువలేనన్నాడు. ఆ రోజులు తనకు ఎన్నో పాఠాలు నేర్పాయని పేర్కొన్నాడు.