భారీ ట్రాఫిక్‌ జాం

హైదరాబాద్‌: పంజాగుట్టలో హోర్డింగ్‌ ఏర్పాటు పనులవల్ల ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ స్థంభించింది. దీంతో పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అసెంబ్లీ,  ఎన్టీఆర్‌ గార్డెన్స్‌, తెలుగుతల్లీ ఫ్లైఓవర్‌, ఐమాక్స్‌ ప్రాంతాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి.