భారీ వర్షాలకు రాష్ట్రంలో 22మంది మృతి

హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న 48 గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కోస్త అంతటా కురుస్తాయనివాతావరణ శాఖ వెల్లడించడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు విపత్తు నిర్వహణశాఖ కమిషనర్‌ రాధ తెలియజేశారు. ఇప్పటి వరకూ భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో 22 మంది మృతిచెందినట్లు తెలియజేశారు. కోస్తాలో నర్సాపూర్‌లో  అత్యధికంగా 31 సెంటీమీటర్ల వర్షం కురిసిందిని చెప్పారు. రాయలసీమలోని సత్యవేడులో అత్యధికంగా 5సెంటీమీటర్ల వర్షం నమోదైందని వివరించారు.