భార్యను హత్యచేసిన భర్త

చిత్తూరు : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కాచీపెంట్ల గ్రామ శివారులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. అమెను నాలుగురోజుల క్రితం తన భర్తే హతమార్చి ఓ రేకుల షెడ్‌లో పడేసాడు. దుర్వాసన రావడంతో బుధవారం ఉదయం స్థానికులకు సమాచారం అందించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలోని పొంగూరు గ్రామానికి చెందిన వజ్జిగం, ఆయన భార్య మణి కూలి పనులు చేసుకొనేందుకు ఇక్కడికి వలస వచ్చారు. అయితే వజ్జిగం తన భార్య మణిని ఎందుకు హతమార్చాడనే తెలియాల్సిఉంది. భార్యను హత్యచేసి, వారు నివాసం ఉంటున్న రేకుల షెడ్‌లో పడేసి, దానికి తాళం వేసి అతను పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.