భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త, పరిస్థితి విషమం

ఖమ్మం, ఆగస్టు 8 : క్షణికావేశంలో భార్యపై భర్త కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో జరిగింది. ముద్దనూరు గ్రామంలో నివసముంటున్న దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త…. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు.