భావనపాడులో కీచకపర్వం

సంతబొమ్మాళి : సభ్యసమాజం తలదించుకొనే సంఘటన ఇది. మండలంలోని భావనపాడు బీచ్‌కు వచ్చిన ప్రేమికుల జంటతో అదే గ్రామానికి చెందిన ఇద్దరు ఆకతాయిలు వికృతంగా ప్రవర్తించారు. ప్రియుడుని చెట్టుకు కట్టేసి కొట్టి ప్రియురాలిని వివస్త్రను చేశారు. ఆమె ప్రాణ భయంతో రోడ్డుపై పరుగులు తీయడం గమనించిన కొందరు ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు. గ్రామస్థులు అక్కడకు చేరుకునే సరికే ఆకతాయిలు పరారయ్యారు. ఆ జంటను గ్రామస్థులు స్వస్థలానికి పంపించేశారు. అనంతరం ఫోన్‌ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆకతాయిల వివరాలు పోలీసులు ఆరా తీస్తున్నారు.