భూ హక్కుల బదిలీ విధానంపై సమీక్షకు మంత్రివర్గ ఉప సంఘం

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అక్రమణదారులకు వాటి హక్కుల బదిలీపై ఉన్న విధానాన్ని సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రీ సహా మున్సిపల్‌, సాంఘీక సంక్షేమ, పౌరసరఫరాలు, భారీ పరిశ్రమలశాక మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. 2008 ఫిబ్రవరిలో ఇచ్చిన జీవో 166లో మార్గదర్శకాలను ఈ ఉపసంఘం సమీక్షిస్తుంది.