భ్రూణహత్యలను హత్యానేరంగా పరిగణించనున్న మహరాష్ట్ర

ముంబయి:భ్రూణహత్యల నివారణుకు మహరాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయమే తీసుకుంది.ఆడపిల్ల పట్ల వివక్షతో,మగపిల్లలనే కోరుకుంటూ కొందరు పాల్పడుతున్న బలవంతపు శిశుహత్యలకు తెరపడాలంటే కఠిన శిక ఉండాలని భావిస్తున్నామని భ్రూణ హత్యలను హత్యానేరాలుగా పరిగణించాలనుకుంటున్నామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.దీనిపై కేంద్రప్రభుత్వ వర్తింపచేస్తే బాగుంటుందన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపామని మహరాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి సురేశ్‌ శెట్టి శాసన సభకు తెలిపారు.కేంద్రం ఆ ప్రతిపాదనను అంగీకరిస్తే బలవంతపు గర్భస్రావాలు చేసే వైదుల్ని హత్యనేరం కింద విచారించవచ్చని ఆయన చెప్పారు.