మంత్రాలయ అగ్నిప్రమాదంలో 5కి చేరిన మృతుల సంఖ్య

ముంబాయి: మహారాష్ట్ర సచివాలయ భవనం మంత్రాలయలో సంభవించిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 5కి చేరింది. ఇంకా కొంతమంది కన్పించడం లేదని తెలుస్తొంది. ఈ భవనం నుంచి దాదాపు 3వేల మందిని ఖాళీ చేయించారు. ప్రస్తుతం భవనాన్ని చల్లబరిచే ప్రయత్నంచేస్తున్నారు. అందుకు 48గంటల సమయం పడుతుందని భావిస్తున్నారు. తిరిగి భవనాన్ని ఉపయోగకరంగా మర్చడానికి కొంత సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. ప్రమాదం నేపధ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి వృధ్వీరాజ్‌ చవాస్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రమాదానికి కారణాలు దర్యాప్తు చేయవలసిందిగా ఆయన క్రైమ్‌ బ్రాంచి పోలీసులను ఆదేశించారు.