మంత్రి జగదీష్ రెడ్డిపై చేసిన ఆరోపనలకు కట్టుబడి ఉన్నా:పొన్నం..

హైదరాబాద్: మంత్రి జగదీష్‌రెడ్డిపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని మాజీ ఎంపీ పొన్నం అన్నారు. ఆరోపణలు నిరూపించేందుకు వేదిక కావాలని తెలిపారు. విచారణ పూర్తయ్యేవరకు జగదీష్‌రెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ పొన్నం చేశారు. లోకాయుక్త మూడు సార్లు అడిగినా..ప్రభుత్వం ఎందుకు నివేదిక సమర్పించలేదని ఆయన ప్రశ్నించారు. ఓయూ విద్యార్థులపై కేసీఆర్‌, నాయిని తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.