మంత్రి ధర్మాన వివరణపై ఈసీ అసంతృప్తి

హైదరాబాద్‌: మతపరమైన వ్యాఖ్యలపై ధర్మాన ఇచ్చిన వివరణపై ఈసీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. బాథ్యతగల పదవిలో ఉంటూ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఈసీ ముందలించింది. మరోమారు ఇలాంటివి పునరావృతమైతే ధర్మానపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల ప్రధానాకారి భన్వర్‌లాల్‌ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి మతపరమైన వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన పిర్యాదుపై ఈసీ గతంలో నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి మంత్రి ఇచ్చిన వివరణకు ఈసీ నుంచి సమాధానం వచ్చినట్లు భన్వర్‌లాల్‌ తెలపారు. ఎన్నికల ప్రచారం నేపధ్యంలో వైఎస్‌ విజయసూట్‌కేసును పోలీసులు తనిఖీ చేయడంలో తఫ్పులేదని అన్నారు. పదో తేదీ సాయంత్రం5 గంటలకల్లా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ముగించాలని ఆదేశించారు.