మంత్రి పార్థసారథికి హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌: మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్ధసారథికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ట్రిబ్యూనల్‌ ఇచ్చిన తీర్పుపై ఇవాళ కోర్టు స్టే విదించింది. దీన్ని సవాల్‌ చేస్తూ పార్థసారథి ఈడి ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యూనల్‌ కూడా ఈడి నిర్ణయాన్ని సమర్ధిస్తూ జరిమాన కట్టాల్సిందేనని చెప్పింది. దీనిపై మంత్రి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ట్రిబ్యూనల్‌ తీర్పుపై స్టే విదిస్తూ తీర్పునిచ్చింది. గతంలో ఇదే కేసు విషయంలో కోర్టు 2నెలల శిక్ష విధిస్తూ తీర్పు చేప్పిన విషయం విధితమే.