మంత్రి పార్థసారధిపై కేసు నమోదు.

విజయవాడ : మంత్రి పార్థసారధిపై విజయవాడలో కేసు నమోదైంది. ఎన్నికల అపిడవిట్‌లో వాస్తవాలు వెల్లడించినందుకు విజయవాడ అర్డీవో కేసు నమోదుచేశారు. ఎన్నికల సంఘం అనుమతి మేరకు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద మంత్రిపై కేసు నమోదు చేసినట్లు అయన తెలిపారు.విజయవాడ ఫస్ట్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్టేట్‌ కోర్టులో సెక్షన్‌ 125ఎ, అర్‌.పి.యాక్ట్‌ 33, ఐసీసీ సెక్షన్‌ 177 కింది కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.