మంత్రి ప్రసాద్‌కు చేదు అనుభవం

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనను అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతించలేదు.  పోలీసుల దురుసు ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అక్కడ కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. ఇంతలో అక్కడున్న ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ ఆలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న డీసీపీ శ్రీకాంత్‌తో వాగ్వాదానికి దిగారు. మంత్రి పట్ల పోలీసుల ప్రవర్తన బాగాలేదంటూ మండిపడ్డారు. ఓ దశలో డీసీపీ, ఎంపీ దుర్భాషలాడుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మంత్రిని ఆలయంలోకి అనుమతించడంతో గొడవ సద్దుమనిగింది.