మంత్రి మల్లారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన అఫ్జల్ ఖాన్
: శామీర్ పేట్, జనం సాక్షి :శుక్రవారం కేసిఆర్ సేవా దళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ మేడ్చల్ ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ని రంజాన్ మాసం ఆగమనం సందర్భంగా ఆయన నివాసం వద్ద కలిసి శాలువా కప్పి సన్మానించారు. అదే విధంగా ఆయనకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతు మోదటి నుండి పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న అఫ్జల్ ఖాన్ కు మంచి నామినేటెడ్ పదవి వరించవచ్చని, నా శాయశక్తులా అఫ్జల్ ఖాన్ కు అన్ని విధాలా మద్దతుగా ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు.. గత వారం మంత్రి మల్లారెడ్డి గృహ ప్రవేశ వేడుకకు విచ్చేసిన సందర్భంగా నా పట్ల ఒక అవగాహన కు వచ్చినట్లు తెలుస్తోందని,వారు ఎటువంటి బాధ్యత అప్పగించి న దాన్ని స్వీకరించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి కి అఫ్జల్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు బుర్క వెంకటేష్ ఉన్నారు.