మంత్రి వయలార్‌ రవితో తెలంగాణ ఎంపీల భేటీ

ఢిల్లీ: కేంద్ర మంత్రి వయలార్‌ రవితో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు బలరాం నాయక్‌, మంద జగన్నాథం, వివేక్‌, రాజయ్య భేటీ అయ్యారు. దాదాపు అరగంట సేపు వీరు వయలార్‌తో చర్చలు జరిపారు. అనంతరం బరరాంనాయక్‌ మీడియాతో మాట్లాడుతూ వయలార్‌ రవితో తెలంగాణ అంశం గురించి చర్చించ లేదన్నారు. బయ్యారం లేక ఇల్లెందులో ఉక్కు కర్మాగారం ఏర్పాటుచేయాలని కోరినట్లు చప్పారు. సింగరేణి కాలరీస్‌లో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని కూడా మంత్రిని కోరినట్లు వివరించారు.