మంత్రుల కమిటీ తొలి సమావేశం 30న

హైదరాబాద్‌: 10మందితో కూడిన మంత్రుల కమిటీ రేపు తొలిసారి సమావేశం కానుంది. ఉప ఎన్నికల్లో ప్రజలను ఎందుకు ఆకట్టులేకపోయాయో మంత్రుల కమిటీ దృష్టిసారిస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు ఏం చేయాలో ఈ కమిటీ సూచిస్తుందని ఆయన తెలిపారు. కొంత మంది జిల్లా ఇంచార్జీ మంత్రులు సమీక్షా సమావేశాలు నిర్వహించడం లేదని అన్నారు. జిల్లా సమీక్షా సంఘాలను పునర్‌వ్యవస్థీకరిస్తానని తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రుల మార్పులు చేర్పులుంటాయని వెల్లడించారు. జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రుల మార్పుల్లో అభ్యంతరాలుంటే తన దృష్టికి తీసుకురావాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు