మంత్రుల రాజీనామాలను ఆమోదించేది లేదు: ఈశ్వరప్ప

బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వర్గీయులైన 9 మంది మంత్రులు చేసిన రాజీనామాలను ఆమోదించేది లేదని కర్ణాటక భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేఎన్‌ ఈశ్వరప్ప తెలిపారు. దీనిపై ఈశ్వరప్ప శనివారం మీడియాతో మాట్లాడుతూ మంత్రుల రాజీనామాలను ఆమోదించే ప్రశ్నే లేదని తేల్చి చిప్పారు. సదానందగౌడ్‌, శెట్టర్‌కు మద్దతిస్తున్న నేతలు అదిష్థానం తీసుకనే నిర్ణయానికి కట్లుబడి ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి సదానందగౌడను ఈరోజు కార్మిక శాశ మంత్రి బీఎన్‌ బచే గౌడ్‌ కలిశారు. అనంతరం ఆయన మీడాయాతో మాట్లాడుతూ నాయకత్వ మార్పు ప్రశ్నే లేదన్నారు. సదానందే ముఖ్యమంత్రిగా కొనసాగతారని చెప్పారు.