మంథనిలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

జనంసాక్షి, మంథని : భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను సోమవారం మంథనిలోని రాజగృహలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోకవర్గ ఇంచార్జీ, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజతో కలిసి కేక్‌ కట్‌ చేసి కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఎమ్మెల్సీ కవిత మహిళా లోకానికి ఆదర్శమని ఈ సందర్బంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్ గౌడ్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.