మందకొడిగా తెలుగు సభలకు ఏర్పాట్లు
నవంబర్ 15 (జనంసాక్షి):
నగరంలో మరో 40 రోజుల్లో నిర్వహించ తలపెట్టిన నాల్గవ తెలుగు సభల ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ గురువారం సమీక్షించారు. ఏర్పాట్లు పురోగతి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎమ్‌ఆర్ పల్లె గ్రామం వద్ద సభలు జరిగే ప్రాంతాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సందర్శించారు. సభావేదిక కోసం గుర్తించిన 90 ఎకరాల భూమిని అధికారులు చదును చేయలేదు. కానీ ఆమె అక్కడే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదు. అనంతరం పద్మావతి అతిథి గృహం వద్ద అధికారులతో సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిపై ఆమె తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రధాన కార్యదర్శి రాకకు ముందే అక్కడ పనులు ప్రారంభించినట్లు విలేఖరులకు అవగతమైంది. మాథ్యూ సందర్శించిన సందర్భంగా మూడు రోజుల సభలకు 20 వేల ప్రతినిధులకు బస అందుబాటులోకి తేలేకపోతున్నామని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అనటం కనిపించింది. పట్టణంలో, చుట్టుపక్కల కేవలం నాలుగు వేల మంది ప్రతినిధులకు బస ఏర్యాటు చేయాలని తలపోసామని, కానీ ప్రపంచ తెలుగు సభలు జరిగే సమయంలోనో వర్శిటీ సెమిస్టర్ పరీక్షలు ఉన్నందున ఆ ప్రతిపాదన విరమించుకున్నట్టు ఆయన వివరించారు. దీన్ని చర్చలో ఒక కీలకమైన అంశంగా పరిగణించిన ప్రధాన కార్యదర్శి సభాస్థలి వద్ద గుడారాల్లో మిగిలిన ప్రతినిధులకు బస ఏర్పాటు చేయాలని ఖరారు చేసారు. సమీక్షా సమావేశానంతరం మిన్నీ మాథ్యూ విలేఖరులతో మాట్లాడుతూ తిరుపతి పట్టణంలో తగినంత వసతి సౌకర్యాలు అందుబాటులో



