మత్రుల రాజీనామాలపై గవర్నర్‌ను కలుస్తాం
బెంగుళూరు : 14 మంది భాజపా ఎమ్మెల్యేలతో ఈ రోజు సాయంత్రం గవర్నర్‌ను కలుస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప హెచ్చరించారు. మంత్రుల రాజీనామాలను స్వీకరించకుండా సభాపతి కేజీ బోపయ్య విదేశీపర్యటనకు వెళ్లిపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో యడ్యూరప్ప మద్దతుదారులు తమ రాజీనామాలను అందజేయ లేకపోయారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం నెలకొందని, ప్రస్తుతం జగదీశ్ శెట్టర్ ప్రభుత్వానికి ఆధిక్యం లేదని యడ్యూరప్ప అంటున్నారు.