మత్స్సకారులతో అధికారుల చర్చలు విఫలం

విశాఖపట్నం: జిల్లాలోని పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామంలో మత్స్యకారులకు అధికారులకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇంతవరకు సరైన ఒప్పందం కుదరలేదు. దీంతో తీరంలో ఉప్పుటేరుకు తీరానికి మధ్య మత్స్యకారులు ఇసుక బస్తాలను వేసి గట్టు నిర్మించే పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంటికొక ఉద్యోగం ఇచ్చి తమ కుటుంబాలకు ఉపాధి కల్పిస్తేనే గట్టును తొలగిస్తామంటున్నారు. దీంతో విశాఖ ఆర్డీఓ రంగయ్య ఈరోజు మత్స్యకారులతో చర్చలు జరిపారు. దశల వారీగా ఉపాధి కల్పిస్తామని హామిఇచ్చినా మత్స్యకారులు అంగీకరించక పోవడంతో అధికారులు వెనుదిరిగారు. తక్షణమే ఉపాధికి అగ్రిమెంట్‌ ఇస్తే తప్ప గట్టును తొలగించబోమని చెప్పడంతో చర్చలు విఫలమయ్యాయి. దీంతో అధికారులు వెనుదిరిగారు.