మద్దతు ఉపసంహరణపై చర్చిస్తున్న మజ్లిస్‌

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే విషయంపై చర్చిందేందుకు ఎంఐఎం అత్యవసర సమావేశం సోమవారం ప్రారంభమైంది. మజ్లిస్‌ పార్టీకి 1 ఎంపీ, 7గురు ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రభుత్వం పాతబస్తీలో పోలీసులను భారీ ఎత్తున మోహరించింది. మరోవైపు సంక్షోభాన్ని చక్కదిద్దేంఉకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ రంగంలోకి దిగింది. మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీకి సర్దిచెప్పాలని రాష్ట్ర నేతలను అధిష్టానంలోని పెద్దలు ఆదేశించారు. తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ఎంపీ ఎంఏ ఖాన్‌ అసద్‌ను కోరారు. చార్మినార్‌ పక్కనే ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం పునర్మిర్మాణ పనుల విషయమై ఎంఐఎం పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన సంగతి తెలిసిందే.

తాజావార్తలు