మద్యం దుకాణాల దరఖాస్తుల పై ప్రభుత్వానికి రూ. 170కోట్లు ఆదాయం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని 5703 మద్యం దుకాణాలకు 68284 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ. 170కోట్లు ఆదాయం వచ్చింది. 893 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. 2010లో 6596 దుకాణాలకు 48602 దరఖాస్తులువచ్చాయి. అలాగే దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కేవలం రూ. 48 కోట్లు మాత్రమే.