మద్యాన్ని ప్రభుత్వానికి ఆదాయవనరుగా చూడరాదు

హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం పేరుతో పేదవాళ్ల రక్తం తాగుతున్నారుని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు.రాష్ట్రన్ని మధ్యప్రదేశ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన మద్యన్ని ప్రభుత్వానికి ఆదాయ వనరుగా చూడరాదన్నారు. మద్యం సిండికేట్లలో మంత్రుల పిల్లలు ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. బెల్టు దుకాణాలు లేకుండా అరికట్టాలని నిర్వహిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వమే మద్యం అమ్మకాలను చేపట్టాలని, కేరళ, ఢిల్లీలో ప్రభుత్వాలే మద్యం దుకాణాలను  నిర్వహిస్తున్నాయని చంద్రబాబు తెలియజేశారు. ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.