మధ్యంతర ఎన్నికలకు సిద్దం కండి: గఢ్కరీ

సూరజ్‌ఖండ్‌: కేంద్రంలోని యూపీఏకు తృణమూల్‌ కాంగ్రెస్‌ తన మద్దతును వెనక్కు తీసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మనుగడ కష్టమని భాజపా అధ్యక్షుడు నితిన్‌గఢ్కరీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మునిగిపోతోందని దీన్ని దృష్టిలో వుంచుకొని భాజపా శ్రేణులు మధ్యంతర ఎన్నికలకు సిద్దంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తూ ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశముందన్నారు.