మధ్యాహ్నభోజన కార్మికులు మోకాళ్ళ పై నిరసన

మధ్యాహ్నభోజన కార్మికులు మోకాళ్ళ పై నిరసన

జుక్కల్,సెప్టెంబర్ 23, (జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని మద్నూర్ మండలకేంద్రంలో శనివారం మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతు మోకాళ్ళ పై నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా తెలంగాణా మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపునూరి చక్రపాణి మాట్లాడుతు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత సంవత్సరం మార్చిలో మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు మూడు వేల వేతనాన్ని అందజేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అమలుచేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. అయిదు నెలల పెండింగ్ బిల్లులు ఇంతవరకు ప్రభుత్వం చెల్లించలేదని ఆయన తెలిపారు.మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు పైసలు లేక పుస్తే నమ్ముకుని వంటలు చేస్తున్నారని ఆయన తెలిపారు.తమ న్యాయ మైన డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో ఉలుకుపలుకులేదని ఆయన అన్నారు.ఇకనైనా ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నేరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల మధ్యాహ్న భోజన పథకం కార్మికుల అధ్యక్షురాలు సావిత్రి,కార్మికులు సాయమ్మ, భూదేవి, గంగమణి, లక్ష్మీ, సరిత తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు