మనోహర్ రెడ్డి గెలుపు హర్షినియం.

తాండూరు డిసెంబర్ 4(జనంసాక్షి) కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి గెలుపు హర్షనీయమని ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి దీపక్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలుపుతూ ఆయన మాట్లాడుతూ తాండూర్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి నందుకుగాను ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి కి పట్టం కట్టినందుకు గాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడం కేవలం మనోహర్ రెడ్డితోనే సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాండూర్ కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తీసుకువచ్చారని తెలిపారు.