మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ వ్యవస్థాపకులు సత్యనారాయణ శాస్త్రి

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 1
అల్వాల్ పట్టణ కేంద్రంలోని కనజిగూడ లో మరకత శ్రీ గణపతి దేవాలయంలో ఏకో గణపతిని ప్రత్యేక పూజలతో పూజించిన ఆలయ కార్యనిర్వాహక వ్యవస్థాపకులు డాక్టర్ మోతుకూరి సత్యనారాయణ శాస్త్రి నిర్వహించారు. రెండవ రోజు అష్ట దశ పురాణాలు శత్రువులు స్మృతులు రచించిన వ్యాస మహర్షి అష్టదశ ఉప పురాణాన్ని రచిస్తుండగా కలిగిన సందేశాల నివృత్తికై సత్య లోకం చేరుకొని బ్రహ్మ దేవుని నుండి మత్రో ప్రదేశాన్ని పొంది తపస్సు సాగించాడు. వ్యాసుని కఠోర తపస్సు వల్ల ముల్లోకాలకు తపోజ్వాలలు వ్యాపించడంతో దేవతలు ఋషులు తపస్సుని చలించి లోకశ్శాంతిని చేకూర్చమని అభ్యర్థించగా వ్యాసుడు చలించి అర్ధాంతరంగా తపస్సును ముగించాడు. కానీ మిగుల దుఃఖముతో గణపతి కటాక్షం పొందని తన శరీరాన్ని దహించమని పంచాంగులు ప్రార్థించాడు. ఉవ్వెత్తున ఎగిసిపడతున్న పంచాంగులు చుట్టుముట్టినప్పుడు వ్యాసుడు నిర్చల మనసుతో నిర్మల భక్తితో గణపతిని ప్రార్థించాడు. ఆ సమయమున వ్యాసుని చుట్టి కంబళించడానికి సిద్ధమైన పంచాంగులన్నీ అంతరిక్షంలోనికి ఎగిసి  ప్రచండాగిగా మారి ఆకాశంలో మహాగణపతి విశ్వవిరాట్ స్వరూప దర్శనంతో అనుగ్రహించగా వ్యాసుడు గణేశు పురాణాన్ని పూర్తి చేశాడు. మహాగణపతి అవతారంలో అవతరించిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామిని సమీపత్రం. జాజి పత్రాలతో పూజించినట్లయితే నవగ్రహ దోషాలు సర్వ విఘ్నాలు తొలుగుతాయని మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ కార్యనిర్వాక వ్యవస్థాపకులు డాక్టర్ మోతుకూరి సత్యనారాయణ శాస్త్రి తెలిపారు.