మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం…

హైదరాబాద్ : సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు. కేబినెట్ సమావేశంలో  తాజా రాజకీయ పరిణామాలు, నూతన పారిశ్రామిక విధానం, డబుల్ బెడ్ రూమ్స్ నిర్వహణ, పాలమూరు ఎత్తిపోతల పథకం, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఉద్యోగాల భర్తీ, ఓటుకు నోటు వ్యవహారంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.