మరోమారు ఉద్యమ దిశగా ఎస్కే వర్సిటీ విద్యార్థులు

అనంతపురం,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): కాంట్రాక్ట ఉద్యోగులను క్రమబద్దీకరించే విషయంలో విద్యార్థులు మండిపడుఉతన్నారు. ఈ నిర్ణయం వల్ల తమ ఉద్యోగావకాశాలు దెబ్బతింటాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు స్కేయూ ముఖద్వారం వద్ద విద్యార్థులు నిరసన దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే శనివారం పరిస్థితి సాధారణ స్థితికి చేరింది. అయినా విద్యార్థులు ఇదే విషయమూ చర్చించడం కనిపించింది. దీంతో యూనివర్సిటీ మరోమారు ఉద్యమానికి వేదిక కానుందని తెలుస్తోంది. విభజన సందర్భంలోనూ ఎస్కే వర్సిటీ విద్యార్థులు గట్టిగా పోరాడారు.  కాంట్రాక్టు విధానాన్ని క్రమబద్దీకరించి నిరుద్యోగుల పొట్టకొట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే భారీమూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఎస్కేయూ నిరుద్యోగ పోరాట ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్‌ చేసింది.ప్రభుత్వం కాంట్రాక్టు విధానంలో ఉన్న జూనియర్‌ లెక్చరర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్లను క్రమబద్దీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం వేసిందన్నారు. మంత్రి వర్గం కాంట్రాక్టు విధానాన్ని క్రమబద్దీకరిస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండదన్నారు. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారానే ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేసింది. తామంతా ఆందోళనలో ఉన్నామని విద్యార్థి నాయకులు ప్రకటించారు.  ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయంపై శుక్రవారం సాయంత్రం  రోడ్డెక్కి నిరసన వ్యక్తంచేయడంతో పాటు ఐటిశాఖ మంత్రి ప్లలె రఘునాథరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా పోలీసులు వారిని అదుపు చేసే క్రమంలో జరిగిన తోపులాట స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులపై లాఠీ ఛార్జి చేయడంతో కొందరు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు జాతీయ రహదారిపై నుంచి వర్సిటీ వసతిగృహాల వరకు విద్యార్థులను చెదరగొట్టారు. సాయంత్రం విద్యార్థులు ఒక్కసారిగా రో/-డడెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ¬రెత్తించారు. జాతీయరహదారిపై గంటల తరబడి బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను ఆందోళన విరమించే ప్రయత్నం చేశారు. ఈసందర్భంగా పోలీసులు కొందరు విద్యార్థులను అదుపులోకి తీసు కొని అరెస్టు చేసారు.   ప్రభుత్వం కాంట్రాక్టు విధానాన్ని క్రమబద్దీకరించబోమని ప్రకటించే వరకు ఆందోళనలు చేయాలని నిర్ణయించినట్లు విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు.